వ్యక్తిగత అభిప్రాయాలు మరియు ఆలోచనలకు మరింత ప్రాముఖ్యానిస్తూ మన దృష్టిని ఆకర్షించే ఈ ప్రపంచంలో, మనం నిజాన్ని ఎక్కడ కనుగోనగలం ? ఎవరిని మనము విశ్వసిచగలము ? థియాలజీ కామన్, ఈ రెండు ప్రశ్నలకు సమాధానం యేసు క్రీస్తు మరియు బైబిలే అంతిమ అధికారం అని విశ్వసిస్తుంది. అన్ని విషయాలలో బైబిల్ ప్రపంచ దృష్టికోణం లో అలోచించి అడుగు వేయడం ప్రతి క్రైస్తవునికి ముఖ్యమైనది. (1 పేతురు 3:15, ఎఫెసీయులకు 4:25, హెబ్రీయులకు 6:1)
ప్రతి క్రైస్తవుడు ఒక వేదాంతి. అంటే, ఆయన వ్రాతపూర్వక వాక్యము ద్వారా క్రీస్తులో మనకి కనపరచుకున్న దేవుని గూర్చి జ్ఞానము మన మనస్సులలో నింపబడి, ఆయనను ఆత్మ సంబంధమైన వివేకము గలవారమై ఆత్మతోను, సత్యముతోను ఆనందించ వలసి ఉన్నది. (కొలొస్సయులకు 1:9). ఈ వాక్యము వినుట ద్వారానే మనకు విశ్వాసము కలిగి , ఆ విశ్వాసము ద్వారానే మనకి రక్షణ లభించింది. అదే వాక్యము ద్వారానే మన నడవడిని సరిచేసుకొని , అయన మహిమకై జీవించుట అయన చిత్తము. (2 తిమోతి 3:16)
థియాలజీ కామన్ ప్రజలు వారి ఆత్మీయ జీవితలలో ఎదగడానికి, పూర్ణ హృదయముతో దేవుని ప్రేమించి, ఈ లోకములో కృపా సత్యములతో జీవించటానికి వారిని సంసిద్థపరుస్తుంది. ఆసక్తికరమైన వ్యాసాలు మరియు పాడ్కాస్ట్ ల ద్వారా దీనిని చేయాలని ఆశిస్తున్నాము
మీకు ఏవైనా ప్రశ్నలు, సలహాలు ఉన్నట్లయితే , దయచేసి మాకు వ్రాయండి.
support@theologycommon.com